News August 15, 2024
ఓ దేశం కంటే పెద్దదైన ఎయిర్‌పోర్టు!

విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈక్రమంలో రద్దీకి అనుగుణంగా విమానాశ్రయాలు సైతం పెరుగుతున్నాయి. అయితే, సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఓ దేశ విస్తీర్ణం కంటే కూడా పెద్దదనే విషయం మీకు తెలుసా? ఈ విమానాశ్రయం 780 చ.కిలోమీటర్ల విస్తీర్ణంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇది మూడు ఎయిర్‌పోర్టులున్న బహ్రెయిన్ దేశం కంటే కూడా పెద్దది.
Similar News
News December 28, 2025
ధోనీతో ఆడటం నా అదృష్టం: డుప్లెసిస్

CSKలో MS ధోనీ, స్టీఫెన్ ఫ్లేమింగ్ వంటి గొప్ప ప్లేయర్ల ఆధ్వర్యంలో ఆడటం తన అదృష్టమని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నారు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. CSKలో పదేళ్లు, JSKలో మూడేళ్లు ఆడానని, ఇదో గొప్ప ఫ్రాంచైజీ అని అన్నారు. ఇటీవల IPLకు డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం సౌతాఫ్రికా T20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నారు.
News December 28, 2025
శబరిమల ఆలయం మూసివేత.. రీఓపెన్ ఎప్పుడంటే?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజా కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న 5PMకు ఆలయం తెరుస్తామని చెప్పింది. మరోవైపు ఇప్పటిదాకా 30 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ₹333 కోట్ల ఆదాయం టెంపుల్‌కు వచ్చింది.
News December 28, 2025
ఉక్రెయిన్ ఒప్పుకోకున్నా మా ‘లక్ష్యం’ సాధిస్తాం: పుతిన్

రెండు దేశాల మధ్య వివాదాన్ని శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ త్వరపడటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఇందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యేక సైనిక చర్య ద్వారా బలవంతంగానైనా అన్ని లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు. 500 డ్రోన్లు, 40 మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కమాండ్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా సైనిక దుస్తుల్లో పుతిన్ కనిపించారు.


