News October 29, 2024
CO2ను O2గా మార్చే కృత్రిమ ఆకు!

చెట్లు ఆక్సిజన్‌ను అందించి, కార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరిస్తుంటాయన్న విషయం తెలిసిందే. అయితే, కృత్రిమంగా అభివృద్ధి చేసిన ఆకులు నిజమైన వాటికంటే పది రెట్లు అధికంగా CO2ను గ్రహించాయి. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీటిని రూపొందించారు. ఈ ఆకులోని ప్రత్యేకమైన పొర లోపల ఉన్న సాంకేతికత నీటి రూపంలో CO2ను గ్రహించి దీనిని ఆక్సిజన్‌గా మార్చుతుంది. ప్రస్తుతం ఇవి ప్రయోగదశలో ఉన్నాయి.
Similar News
News November 7, 2025
PCOD, PCOS రాకుండా ఉండాలంటే?

మారిన జీవనశైలి వల్ల చాలామంది అమ్మాయిలు PCOD, PCOS సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అధిక బరువుంటే వ్యాయామం చేస్తూ, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.
News November 7, 2025
ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.
News November 7, 2025
సోషల్ జస్టిస్& ఎంపవర్మెంట్లో 49 ఉద్యోగాలు

<


