News August 23, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్

యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ‘ప్రొఫైల్ సాంగ్’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. యూజర్లు తమ ప్రొఫైల్ పిక్కు మూడ్‌ను బట్టి పాట యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని లైసెన్స్డ్ సాంగ్స్‌ను అందుబాటులో ఉంచింది. కొత్త సాంగ్ మార్చేవరకు పాతది అలాగే ఉంటుంది. ఇన్‌స్టాలో ఎడిట్ ప్రొఫైల్‌పై క్లిక్ చేసి ‘యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్’ను ఎంచుకోవాలి. నచ్చిన పాటను 30 సెకన్లపాటు సెట్ చేసుకోవచ్చు.
Similar News
News December 22, 2025
ఈ దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం

క్రిస్మస్ సందడి మొదలవుతున్న వేళ కొన్ని దేశాల్లో మాత్రం ఈ పండుగపై నిషేధం ఉంది. ఉత్తర కొరియాలో క్రిస్మస్ జరుపుకుంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదు. సోమాలియాలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను నిషేధించారు. బ్రూనైలో ముస్లిమేతరులు పర్మిషన్ తీసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు. తజకిస్థాన్‌లోనూ ఆంక్షలు ఉండగా, సౌదీలో బహిరంగ వేడుకలకు అనుమతి లేదు.
News December 22, 2025
H-1B షాక్: ఇండియాలో చిక్కుకున్న టెకీలు.. అమెరికా వెళ్లడం కష్టమే!

ఇండియా వచ్చిన H-1B వీసా హోల్డర్లకు సోషల్ మీడియా వెట్టింగ్ రూల్స్‌తో US షాకిచ్చింది. వేలమంది అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి. డిసెంబర్ 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు ఒక్కసారిగా జులైకి మారిపోయాయి. దీంతో మనవాళ్లు ఇక్కడే చిక్కుకుపోయారు. ఆఫీసుల నుంచి అన్‌పెయిడ్ లీవ్స్ తీసుకోవాల్సి వస్తోంది. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఎప్పుడొస్తారో తెలియక టెన్షన్ పడుతున్నాయి.
News December 22, 2025
యూరియాను కౌలు రైతులు ఎలా బుక్ చేయాలి?

TG: కౌలు రైతులు యూరియా పొందాలంటే Fertilizer Booking App డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్ ఆప్షన్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, యాప్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి. తర్వాత యాప్‌లో కనిపించే వివరాలను నింపాలి. బుకింగ్ కోడ్ రాగానే కేటాయించిన సమయంలో డీలర్ వద్దకు వెళ్లి బుకింగ్ ఐడీ చూపించి, డబ్బు చెల్లిస్తే రైతుకు యూరియా ఇస్తారు.


