News April 5, 2025

కంచ గచ్చిబౌలిలో 2000 ఎకరాల్లో ఎకో పార్క్‌.. నిజమేనా?

image

TG: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బదులు అక్కడే HCU భూమితో సహా 2000 ఎకరాలను ఎకో పార్క్‌గా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను HCU రిజిస్ట్రార్ దివేశ్ ఖండించారు. అలాంటి ప్లాన్ ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. వర్సిటీని తరలించేందుకు తాము ఒప్పుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని HCU SU VP ఆకాశ్ అన్నారు.

Similar News

News April 6, 2025

రష్యా పేరెత్తడానికే US భయపడుతోంది: జెలెన్‌స్కీ

image

రష్యా తాజాగా చేసిన దాడుల్లో ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ విషయాన్ని US ఎంబసీకి తెలియజేస్తే బలహీనమైన ప్రతిస్పందన వచ్చిందన్నారు. ‘అగ్రరాజ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా వీక్ రియాక్షన్ వచ్చింది. వాళ్లు రష్యన్ పేరు చెప్పడానికీ భయపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్‌కు సాయం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

News April 6, 2025

PBKS VS RR.. గెలుపెవరిదంటే?

image

PBKSతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా(62), మ్యాక్స్‌వెల్(30) మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్‌లో PBKSకు ఇదే తొలి ఓటమి.

News April 6, 2025

ఒకే ఒక్కడు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

image

PAK బౌలర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్ర సృష్టించారు. వరుసగా 2 వన్డేల్లో 12వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. NZతో జరిగిన రెండో ODIలో హారిస్ రౌఫ్ హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా నసీమ్ వచ్చారు. దీంతో ముఖీమ్ 12వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగారు. మూడో ODIలో ఇమామ్ దవడకు గాయమవడంతో సబ్‌స్టిట్యూట్‌గా ఉస్మాన్ వచ్చారు. దీంతో ముఖీమ్ మరోసారి 12వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు.

error: Content is protected !!