News November 22, 2024
AR రెహమాన్ కుమారుడు ఎమోషనల్ పోస్ట్

భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న రూమర్స్ పట్ల కుమారుడు ఏఆర్ అమీన్ స్పందించారు. ‘నా తండ్రి లెజెండ్. ఆయన విలువలు పాటిస్తూ ఎనలేని గౌరవం, ప్రేమను సంపాదించారు. నా తండ్రిపై అసత్య, అర్థరహిత వార్తలు చూస్తే బాధేస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని మానుకొని, ఆయన మనపై చూపిన ప్రభావం పట్ల గౌరవంగా ఉందాం’ అని పోస్ట్ చేశారు.
Similar News
News November 22, 2025
పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
News November 22, 2025
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా నుంచి భారత్కు తక్కువ రేటుకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని సమాచారం. రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలతో కొన్ని భారత కంపెనీలు ఇప్పటికే కొనుగోళ్లు ఆపేశాయి. US, పశ్చిమాసియా నుంచి వచ్చే ఆయిల్తో దిగుమతి ఖర్చు పెరగనుంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని తెలుస్తోంది.
News November 22, 2025
విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం: మావోయిస్ట్ పార్టీ

డిసెంబర్ 2 నుంచి 8 వరకు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (PLGA) 25వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని CPI(మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది. కగార్ యుద్ధం నుంచి పార్టీని, PLGAని, ప్రజా సంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని పేర్కొంది. 11 నెలల్లో 320 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని తెలిపింది.


