News May 1, 2024
సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్

టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడంపై సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీలోని ‘చెమట.. కష్టం కుట్టిన చొక్కా’ అంటూ సాగే పాట లిరిక్స్‌ను ఇన్‌స్టా స్టోరీ పెట్టుకున్నారు. శాంసన్ శ్రమకు తగిన గుర్తింపు లభించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ (శ్రీశాంత్) తర్వాత ఓ మలయాళీ ప్లేయర్ టీమ్ఇండియా తరఫున వరల్డ్ కప్ ఆడనుండటం ఇదే తొలిసారి.
Similar News
News March 5, 2026
ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <
News March 5, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో 5 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 10 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in
News March 5, 2026
ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లు ఈనెల 26న కాకుండా ఉగాది సందర్భంగా ఈనెల 19న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.


