News August 31, 2024
విమానం గాల్లో ఉండగా ఒక ఇంజిన్ ఫెయిల్..

కోల్కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. 6E 0573 గాల్లో ఉండగా ఒక ఇంజిన్ ఫెయిల్ అయినట్టు పైలట్ గుర్తించారు. దీంతో రాత్రి 10.39కి పైలట్ ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో రన్వేపై ఎమర్జెన్సీని ప్రకటించారు. రెండో ఇంజిన్తో విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
Similar News
News December 10, 2025
RBIలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

RBI 5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్సైట్: rbi.org.in.
News December 10, 2025
వెంకటేశ్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. షూటింగ్ ప్రారంభం

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ఖరారైంది. ‘AK 47- హౌస్ నం. 47’ అనేది క్యాప్షన్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మూవీ టీమ్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. హారిక&హాసిని క్రియేషన్స్ బ్యానర్పై చినబాబు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది. 2026 సమ్మర్లో మూవీని రిలీజ్ చేస్తామని హీరో వెంకటేశ్ వెల్లడించారు.
News December 10, 2025
2,569 ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ నేడే

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఈ దేశవ్యాప్త రిక్రూట్మెంట్కు గడువు తేదీ 10 DEC 2025కు మించి పొడిగించబోమని ఇప్పటికే రైల్వేస్ ప్రకటించింది. 18-33 సం. మధ్య వయస్సు గల బీటెక్, డిప్లొమా, సైన్స్ డిగ్రీ గల వారు దరఖాస్తుకు అర్హులు. ఫీజు: జనరల్/OBC: 500, SC/ST/PWBD/మహిళలు/EBC/మైనార్టీ: ₹250. దరఖాస్తు, పూర్తి వివరాలకు RRB సైట్ చూడండి. Share It


