News September 2, 2024
ఉప్పొంగిన కృష్ణమ్మ.. ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు

కృష్ణానదిలో వరద పెరుగుతుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదిలో ఈతకు వెళ్లడం, స్నానాలు చేయడం, చేపలు పట్టడం చేయొద్దని పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మెసేజ్‌లో పేర్కొంది.
Similar News
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.
News December 3, 2025
అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.
News December 3, 2025
జనాభా పెంచేలా చైనా ట్రిక్.. కండోమ్స్‌పై ట్యాక్స్!

జననాల రేటు తగ్గుతుండటంతో చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా కండోమ్ ట్యాక్స్ విధించనుంది. జనవరి నుంచి కండోమ్ సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13% VAT విధించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్ తొలగిస్తోంది. కాగా 1993 నుంచి కండోమ్స్‌పై అక్కడ వ్యాట్ లేదు.


