News August 8, 2024
‘పుష్ప-2’ నుంచి అదిరిపోయే అప్డేట్

నటుడు ఫహద్ ఫాజిల్ బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ నుంచి అప్డేట్ వచ్చింది. ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మాస్ లుక్లో ఉన్న భన్వర్ సింగ్ షెకావత్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 6వ తేదీన బిగ్ స్క్రీన్లపై సందడి చేయనున్నారని తెలియజేశారు. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News December 23, 2025
రూ.118 కోట్లలో సగం చెల్లించాల్సిందే.. ‘గీతం’కు హైకోర్టు షాక్

TG: హైకోర్టు ఆదేశాలతో HYD <<18584831>>గీతం<<>> యూనివర్సిటీకి అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో 8వేల మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారని వర్సిటీ మరోసారి కోర్టుకు వెళ్లింది. రూ.118 కోట్ల బకాయిల్లో సగం కడితేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని ఇటీవల వర్సిటీకి డిస్కం నోటిసులిచ్చిన విషయం తెలిసిందే.
News December 23, 2025
శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయంటే?

* శీతాకాలంలో పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గి చర్మం పొడిబారడం, మడమలు పగలడం వంటి సమస్యలు వస్తాయి.
* సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర వంటి చర్మ సమస్యల వల్ల కూడా మడమల పగుళ్లు ఏర్పడతాయి. డయాబెటిస్, థైరాయిడ్ పరిస్థితులు కూడా మడమలు పగుళ్లకు కారణమవుతాయి.
* ఈ సీజన్లో చాలా మంది తక్కువగా నీరు తాగుతారు. దీనివల్ల శరీరంలో తేమ లోపిస్తుంది. ఇలా చర్మం పొడిగా మారి మడమల పగుళ్లకు కారణమవుతుంది.
News December 23, 2025
పంచముఖ హనుమత్ స్తోత్రాన్ని ఎందుకు పఠించాలి?

పంచముఖ హనుమంతుడు 5 విశిష్ట శక్తుల సమ్మేళనం. ఆయన స్తోత్రాన్ని పఠిస్తే భయం, శత్రుపీడ, గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. 5 ముఖాలు 5 రకాల అనుగ్రహాలను ఇస్తాయి. వానర ముఖం కోరికలను తీర్చగా, నరసింహ రూపం విజయాన్ని, గరుడ రూపం విష భయాల నుంచి రక్షణను, వరాహ ముఖం ఐశ్వర్యాన్ని, హయగ్రీవ రూపం జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం, సంకల్ప బలం పెరగడం కోసం నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి.


