News August 24, 2024
వారికి ₹10లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి: హరీశ్ రావు

TG: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీశ్రావు అన్నారు. ‘ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఉంది. మొన్న ఒక్కరోజే ఐదుగురు డెంగ్యూతో చనిపోయారు. ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు ₹10లక్షల పరిహారం ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 8, 2025
నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్.. విశేషాలివే!

TG: గ్లోబల్ సమ్మిట్-2025ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ ఇవాళ 2PMకు ప్రారంభిస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.
News December 8, 2025
బరువు తగ్గాలంటే వీటిని ట్రై చేయండి!

బరువు తగ్గాలనుకునేవారికి డ్రైఫ్రూట్స్ సాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘బాదం తీసుకుంటే వాటిలోని ఫైబర్, కొవ్వుల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆక్రోట్లలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకలి తగ్గుతుంది. భోజనానికి ముందు గుప్పెడు పల్లీలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఖర్జూరాల వల్ల అధిక శక్తి అంది త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.
News December 8, 2025
TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.


