News August 24, 2024

వారికి ₹10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీశ్‌రావు అన్నారు. ‘ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఉంది. మొన్న ఒక్కరోజే ఐదుగురు డెంగ్యూతో చనిపోయారు. ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు ₹10లక్షల పరిహారం ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News September 17, 2024

రేవంత్ ధర్మం తెలిసినవాడు: రాజాసింగ్

image

TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. ‘పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరం. రేవంత్ ధర్మం తెలిసినవాడు’ అని వ్యాఖ్యానించారు.

News September 17, 2024

చైనాకు మద్దతు తెలిపిన పాక్ ఆటగాళ్లు

image

ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో చైనాకు పాక్ ఆటగాళ్లు మ‌ద్ద‌తు తెలిపారు. పాక్‌ ఎవ‌రి చేతిలో సెమీస్‌లో ఓట‌మిపాలైందో వారికే సపోర్ట్ చేయడం గ‌మ‌నార్హం. మ్యాచ్ సంద‌ర్భంగా పాక్ ఆట‌గాళ్లు చైనా జెండాల‌ను చేత‌బ‌ట్టుకొని క‌నిపించారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఎవరికి మద్దతు ఇస్తున్నది స్ప‌ష్ట‌ం అవుతోందంటూ కామెంటేట‌ర్ వ్యాఖ్యానించారు. ఆ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

News September 17, 2024

వినాయక నిమజ్జనంలో ప్రమాదం

image

మహారాష్ట్రలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడికో వెళ్లగా.. మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. అది రివర్స్ వెళ్లి ప్రజలపైకి దూసుకెళ్లడంతో 13, 6, 3 ఏళ్ల పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి, అసలైన డ్రైవర్ పారిపోగా, పోలీసులు వెతికి పట్టుకున్నారు. ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.