News September 22, 2024

విచారణ జరగాలి.. దోషులను శిక్షించాలి: పవన్

image

AP: తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా NDA ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని Dy.CM పవన్ హామీ ఇచ్చారు. ‘దీనిపై CBIతో విచారణ జరిపించడంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలి’ అని అన్నారు.

Similar News

News September 22, 2024

ఒవైసీలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి

image

TG: ఎంఐఎం పార్టీ నేతలు, ఒవైసీ సోదరులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. కరీంనగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం విచారణ చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

News September 22, 2024

పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ నారీమణులు

image

తెలంగాణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. మొత్తం 1.88 కోట్లకు పైగా మహిళలుంటే ప్రతి 1000 మందిలో 3.1 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. MSME పాలసీలో తీసుకున్న వివిధ చర్యలతో Udyam పోర్టల్‌లో 58,644 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. మహిళల నేతృత్వంలోని MSMEల వాటా విషయానికి వస్తే టాప్-3లో తెలంగాణ నిలిచింది.

News September 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

AP: తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.