News June 29, 2024

రేపటి నుంచి పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

image

AP ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రేపట్నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనుంది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది కట్టాలా? కాఫర్ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లపై ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై నిపుణుల బృందం ఏం చెబుతుందనేది ఆసక్తిగా మారింది.

Similar News

News October 16, 2025

BREAKING: ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

image

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

News October 16, 2025

బీసీ రిజర్వేషన్లు 50% దాటొచ్చనే తీర్పు లేదు: ప్రతివాదుల లాయర్

image

TG: బీసీ రిజర్వేషన్లపై ప్రతివాదుల తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకర్‌నారాయణన్ వాదనలు వినిపిస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లోనే రిజర్వేషన్ల పరిమితి 50% దాటిందన్నారు. అక్కడ SC, STలకే రిజర్వేషన్లు వర్తించాయని, BCల కోసం 50% పరిమితి దాటొచ్చనే తీర్పు లేదని వాదించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 50% పరిమితి దాటకుండా ఎన్నికలు నిర్వహించాలని గతంలో SC తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

News October 16, 2025

కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

image

TG: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. <<18018400>>వివాదం<<>> నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్ఠానం కూడా రిజైన్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. HNKలోని ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ, పోలీస్ ఔట్ పోస్టును తొలగించడం వీటికి బలం చేకూరుస్తున్నాయి. అటు సురేఖ BC నేత కావడంతో అధిష్ఠానం అంత ఈజీగా పదవి నుంచి తొలగిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.