News June 2, 2024

కూటమికి తిరుగులేని విజయం: చంద్రబాబు

image

AP ఎన్నికల్లో NDA కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని TDP అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమి అభ్యర్థులతో సమీక్షించిన ఆయన.. ‘3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడేందుకు, పోస్టల్ ఓట్లపై కొర్రీలకు YCP ప్లాన్ చేస్తోంది. డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలి’అని సూచించారు.

Similar News

News April 8, 2026

ఖబడ్దార్.. కేటీఆర్, హరీశ్‌కు పొంగులేటి వార్నింగ్

image

TG: KTR, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీ తాటాకు చప్పుళ్లకు భయపడం.. ఖబడ్దార్’ అని సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్‌లో హెచ్చరించారు. ఇక నాదర్‌గుల్ భూముల్లో వాటా దక్కకపోవడం వల్లే హరీశ్ తనపై <<19499785>>ఆరోపణలు<<>> చేస్తున్నారని మండిపడ్డారు. వట్టినాగులపల్లి భూములతో తన కొడుకుకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

News April 8, 2026

గ్రీస్‌లో 15ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధం!

image

గ్రీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రకటించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, SMకి వ్యసనపరులుగా మారుతున్న చిన్నారులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేరెంట్స్ అనుమతి ఉన్నా 15 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లోనూ SMను బ్యాన్ చేశారు.

News April 8, 2026

ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే 50% టారిఫ్: ట్రంప్

image

ఇరాన్‌తో సీజ్‌ఫైర్ కొనసాగుతున్న వేళ ఇతర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50% టారిఫ్స్ విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.