News May 11, 2024
బాలరాముడికి మామిడి పండ్లతో నైవేద్యం

పవిత్రమైన అక్షయ తృతీయ రోజున అయోధ్యలోని బాలరాముడికి మామిడి పండ్లను నైవేద్యంగా ఉంచారు. మామిడిపండ్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, కివి ప్రూట్, గ్రేప్స్తో పాటు మ్యాంగో జ్యూస్ బాటిళ్లను సైతం స్వామివారికి సమర్పించారు. గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలకు సైతం పండ్లను వేలాడదీయడం ఆకర్షణీయంగా ఉంది. దీంతోపాటు అస్సాంలో తయారు చేసిన ప్రత్యేక బంగారు వస్త్రాలతో రామయ్యను ముస్తాబు చేశారు.
Similar News
News October 26, 2025
ముల్తానీ మట్టితో ఎన్నో లాభాలు

ముల్తానీ మట్టికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని చాలా రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి మొటిమలు, మచ్చలు తగ్గించడంలో దోహదపడుతుంది. ట్యాన్ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకి మంచి ఫలితాలనిస్తుంది. ఇది చర్మంపై ఉన్న మురికిని, అదనపు నూనెను తొలగించి మెరిసే చర్మాన్నిస్తుంది.
News October 26, 2025
RTCలో ఉద్యోగాలు.. రెండు రోజులే ఛాన్స్

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. <
News October 26, 2025
ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైందని APSDMA అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో అది గంటకు 6 కి.మీ వేగంతో కదిలిందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


