News April 10, 2024

సుప్రీంకోర్టుకు చేతులు జోడించి వేడుకున్న అధికారి

image

పతంజలి <<12127426>>కేసు<<>> విచారణ సందర్భంగా క్షమించమని కోరిన ఓ అధికారిపై సుప్రీంకోర్టు మండిపడింది. ‘నేను 2023 జూన్‌లో వచ్చాను. ఈ వ్యవహారం నేను రాక ముందు జరిగింది. నన్ను వదిలేయండి’ అని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారి డా.మిథిలేశ్ చేతులు జోడించి వేడుకున్నారు. ఇందుకు బదులుగా.. ‘ఎందుకు క్షమించాలి? మీరేం చర్యలు తీసుకున్నారు?’ అని ప్రశ్నించింది. అంతకుముందు పతంజలి యాజమాన్యంపై కూడా కోర్టు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

Similar News

News March 26, 2026

నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

image

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.

News March 26, 2026

ALERT: టేస్ట్ కోసం చూస్తే.. ప్రాణాపాయమే!

image

ఫాస్ట్‌ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే మీరు డయాబెటిక్ వ్యాధిని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే TG, AP, TN, కేరళం, కర్ణాటకలో ఫాస్ట్‌ఫుడ్ వినియోగం పెరిగిందని IJMR స్టడీ వెల్లడించింది. బయటి ఆహారంపై ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే షుగర్, ఊబకాయం బారిన పడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రూరల్ ఏరియాలో కంటే సిటీల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంది.

News March 26, 2026

కరెంట్ అఫైర్స్

image

* JNTUH బీటెక్ విద్యార్థి శివకుమార్ ఇందూరికి ‘జలశక్తి హ్యాకథాన్ 2025’ పురస్కారం.
* సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,07,879.
* నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, IIT మద్రాస్ రోడ్లపై ‘పొగమంచును హరించే’ టైటానియం డయాక్సైడ్ పూతలను పరీక్షిస్తున్నాయి.
* పుణేలోని శాస్త్రవేత్తలు Neoloboptera peninsularis అనే కొత్త బొద్దింక జాతిని కనుగొన్నారు.