News July 21, 2024
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
TG: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. SRSPకి 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 1,067 అడుగులుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం 36.2 అడుగులకు చేరింది. జూరాలకు ఇన్ ఫ్లో 83 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1.17 లక్షలుగా ఉంది. ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Similar News
News January 24, 2025
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఆ వేలిముద్రలు నిందితుడివే!
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో పట్టుబడిన నిందితుడి, ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్రలు ఒకటే అని పోలీసులు నిర్ధారించారు. నటుడి ఇంటి వద్ద CC ఫుటేజీలో కనిపించిన వ్యక్తి తన కుమారుడు కాదని నిందితుడి తండ్రి వారించారు. దీంతో సైఫ్ ఇంట్లోకి వెళ్లేందుకు నిందితుడు ఎక్కిన పైప్, తలుపులపై ఉన్న వేలిముద్రలను పరిశీలించారు. సైఫ్ 2వ కుమారుడి గదిలో దొరికిన క్యాప్‌కు ఉన్న వెంట్రుకను సైతం పోలీసులు DNA టెస్టుకు పంపారు.
News January 24, 2025
మీ పిల్లలు ఎంతసేపు నిద్ర పోతున్నారు?
పోషకాహారంతో పాటు సరైన నిద్ర పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 6-12 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు కనీసం 9గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇంతకంటే తక్కువ నిద్రపోతే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారని చెబుతున్నారు. వీళ్లు సరైన నిర్ణయాలు తీసుకోలేరని, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల నిద్ర సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
News January 24, 2025
వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలు: భట్టి
TG: వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజాభవన్‌లో అన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను గత ప్రభుత్వం వదిలేయడం వల్లే భారం పెరిగిందని, పర్యావరణ అనుమతులు తెచ్చి యూనిట్-2 ప్రారంభించుకున్నామని భట్టి తెలిపారు.