News March 18, 2024
ఊహించని విధంగా మారిన స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్‌గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX సినిమా కోసం ఈ లుక్‌లోకి మారినట్లు వెల్లడించారు. గతేడాది స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని, అప్పటి నుంచి తాను వర్కౌట్స్ చేస్తున్నట్లు ఆర్య తెలిపారు.
Similar News
News February 3, 2026
అందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారు: రాహుల్

ప్రధాని మోదీ తన ఇమేజ్ పోతుందనే భయపడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. USలో అదానీ గ్రూప్‌పై ఉన్న కేసు నిజానికి మోదీ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసేందుకు పెట్టినదని ఆరోపించారు. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలోనూ మోదీ ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఇందులో ఎన్నో కీలక విషయాలు ఉన్నాయని.. వాటిని ఇంకా US రిలీజ్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇందుకే ప్రధాని భయంతో ఉన్నారని ఆరోపించారు.
News February 3, 2026
8 మంది ఎంపీల సస్పెన్షన్.. లోక్‌సభ రేపటికి వాయిదా

విపక్ష ఎంపీల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. తనపై పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సెషన్ మొత్తం వారిపై సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్‌తోపాటు హిడీ ఈబెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఉన్నారు.
News February 3, 2026
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ: కేటీఆర్

TG: నిరుద్యోగుల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగలడం ఖాయమని KTR హెచ్చరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా సీఎం రేవంత్ ముఖం చాటేశారని ఫైరయ్యారు. అలాగే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తానని చెప్పిన మాట అటకెక్కిందని దుయ్యబట్టారు. 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని ప్రజలు తెలుసుకున్నారన్నారు.


