News November 9, 2024
ఆక్వా కల్చర్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఆనం

AP: కూటమి ప్రభుత్వం 59 మందితో కూడిన నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఛైర్మన్: పట్టాభిరామ్, ఫైబర్ నెట్-జీవీ రెడ్డి, ఫారెస్ట్-సుజయ్ కృష్ణ రంగారావు, ఆక్వా- ఆనం వెంకటరమణారెడ్డి, టెక్నాలజీ-మన్నవ మోహన్ కృష్ణ, కల్చరల్-తేజస్వి పొడపాటి, పర్యావరణం-దినేశ్ రెడ్డి, గ్రంథాలయం-గోనుగుంట్ల కోటేశ్వరరావు, పారిశ్రామికం-డేగల ప్రభాకర్, యాదవ కార్పొరేషన్-నరసింహ యాదవ్ను నియమించింది.
Similar News
News December 9, 2025
ఉంగుటూరులో ఈనెల 11న మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.
News December 9, 2025
క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుండటంతో గ్రామాల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో చికెన్ బిర్యానీ, క్వార్టర్, కూల్డ్రింక్స్ పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఇంటికి కేజీ కోడికూర పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? COMMENT
News December 9, 2025
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు భారీగా పెట్టుబడులు

TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు రూ.1.11లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. పర్యాటక రంగంలో ₹7,045 కోట్లు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ ₹10,000Cr, ఫెర్టిస్ ₹2000Cr, హెటిరో ₹1800Cr, JCK ఇన్ఫ్రా ₹9000Cr, AGP ₹6,750Cr, భారత్ బయోటెక్ ₹1000Cr పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 40K+ ఉద్యోగాలు రానున్నాయి.


