News November 2, 2024
ఆనంద్ బయోపిక్కు ఏఎల్ విజయ్ డైరెక్షన్

ప్రముఖ చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్కు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ బయోపిక్ స్క్రిప్ట్‌ను ‘బిన్నీ అండ్ ఫ్యామిలీ’ రచయిత, దర్శకుడు సంజయ్ త్రిపాఠీ అందిస్తున్నట్టు సమాచారం. ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన ఆనంద్ పాత్రను దక్షిణాది నుంచి ఓ ప్రముఖ నటుడు పోషిస్తారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
Similar News
News November 20, 2025
మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై విచారణలో రవికి ప్రశ్నలు

ఐ-బొమ్మ కేసులో రవి పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. వెబ్‌సైట్‌కు సంబంధించి కీలక విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఇవాళ వెలుగులోకి వచ్చిన ‘ఐబొమ్మ వన్’పైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాని నుంచి మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై రవిని అడిగారు. అతడు వాడిన మొబైల్స్ వివరాలు, నెదర్లాండ్స్‌లో ఉన్న హోమ్ సర్వర్ల డేటా, హార్డ్ డిస్క్‌ల పాస్వర్డ్, NRE, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్లపై సుదీర్ఘంగా విచారించారు.
News November 20, 2025
అపార్ట్మెంట్లో అందరికీ ఒకే వాస్తు ఉంటుందా?

అపార్ట్మెంట్ ప్రాంగణం ఒకటే అయినా వేర్వేరు బ్లాక్‌లు, టవర్లలో దిశలు మారుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘సింహద్వారం దిశ, గదుల అమరిక వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఫ్లాట్‌కి వాస్తు ఫలితాలు కూడా మారుతాయి. అందరికీ ఒకే వాస్తు వర్తించదు. ప్రతి ఫ్లాట్‌ని దాని దిశ, అమరిక ఆధారంగానే చూడాలి. మీ జన్మరాశి, పేరు ఆధారంగా వాస్తు అనుకూలంగా ఉందో లేదో చూడాలిలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 20, 2025
2031కి 100 కోట్ల 5G సబ్స్క్రిప్షన్లు

2031 చివరికి భారత్‌లో 5G సబ్స్క్రిప్షన్లు 100 కోట్లు దాటుతాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. 2031 వరకు మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 79% 5జీకి మారుతాయని పేర్కొంది. 2025 చివరికి 394 మిలియన్లకు సబ్స్క్రిప్షన్లు చేరుకున్నాయని, ఇది మొత్తం సబ్స్క్రిప్షన్లలో 32 శాతమని తెలిపింది. దేశంలో పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం, నెట్వర్క్ విస్తరణ, 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లే నిదర్శనమని చెప్పింది.


