News July 17, 2024
తెలుగులో ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్ మహీంద్ర!
మహీంద్ర గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు Xలో ఆయన తెలుగు భాషలో ట్వీట్ చేశారు. ‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఆ శ్రీ మహా విష్ణువు కృప ఉండాలని కోరుకుంటున్నాం’ అని పోస్ట్ చేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తెలుగులో శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 23, 2025
భార్యను చంపే ముందు ప్రాక్టీస్ కోసం..
TG: భార్యను చంపి ఉడికించిన <<15227723>>కేసులో<<>> సంచలనాలు వెలుగుచూశాయి. వెంకటమాధవిని చంపిన భర్త గురుమూర్తి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు. భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపినట్లు తెలుస్తోంది.
News January 23, 2025
DOGEలో రామస్వామికి పొగపెట్టిన మస్క్!
భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి DOGE నుంచి తప్పుకొనేలా ఎలాన్ మస్క్ పొగపెట్టారని సమాచారం. ఇందుకోసం ఆయన గట్టిగానే పావులు కదిపారని పొలిటికో తెలిపింది. కొన్ని కారణాలతో ట్రంప్ సర్కిల్లోని కొందరు రిపబ్లికన్లు ఆయన్ను వ్యతిరేకించారని పేర్కొంది. ముందే ఆయన్ను తొలగించేందుకు సిద్ధమయ్యారని వివరించింది. H1B వీసాల అంశంలో తెల్లవారి కల్చర్పై ట్వీట్ అంశాన్ని వాడుకొని మస్క్ వారి మద్దతు కూడగట్టారని వెల్లడించింది.
News January 23, 2025
సుకుమార్ ఇంట్లో రెండోరోజు ఐటీ రైడ్స్
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు పుష్ప-2 నిర్మాతలు రవిశంకర్, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో మూడోరోజు రైడ్స్ జరుగుతున్నాయి. దిల్రాజు కుటుంబ సభ్యుల ఇళ్లతోపాటు సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు.