News June 13, 2024
‘బుజ్జి’పై ఆనంద్ ప్రశంసలు
‘కల్కి’ సినిమాలోని బుజ్జి (సూపర్ కార్) గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘ముంబైని ఆక్రమించడమే అతని లక్ష్యం. కానీ, వర్లీలోని మహీంద్రా టవర్స్‌కు చేరుకున్న బుజ్జి తన కజిన్ ‘‘స్కార్పియో-ఎన్’’ను కలిశాక శాంతించాడు. అత్యద్భుతమైన భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న నాగ్ అశ్విన్‌కు అభినందనలు. ఇంత పెద్ద కలలు కనే ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’ అని ఆనంద్ తెలిపారు.
Similar News
News January 15, 2025
కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?
AP: సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమలోని జగ్గన్నతోటలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కనుమ రోజు ప్రభలను ఊరు దాటిస్తే మంచిదని స్థానికుల విశ్వాసం. కొన్ని వందల ఏళ్ల క్రితం జగ్గన్నతోటలోనే ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ప్రతి కనుమ రోజున వీటిని ఒకే చోట చేర్చుతారు. ఈ ప్రభలను తీసుకొచ్చే క్రమంలో యువకులు పొలాలు, వాగులు దాటుతూ ముందుకు సాగుతారు.
News January 15, 2025
కనుమ రోజున రథం ముగ్గు.. ఎందుకంటే?
కనుమ రోజున తెలుగు లోగిళ్లలో రథం ముగ్గు వేయడం ఆచారంగా ఉంది. దీని వెనుక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేది దైవమని భావిస్తారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ రకంగా ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని ఓ కథ. అయితే ఈ ముగ్గులు వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది.
News January 15, 2025
నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ విచారణ
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.