News April 2, 2025
నేడు ప్రకాశం జిల్లాకు అనంత్ అంబానీ

AP: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం సమీపంలో రూ.375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేస్తారు. ఆయనతోపాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
Similar News
News April 6, 2025
BREAKING: టాస్ గెలిచిన GT

IPL2025: ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో GT కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
GT: సాయి సుదర్శన్, గిల్, బట్లర్, తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్
SRH: హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్, కమిందు, కమిన్స్, అన్సారీ, ఉనద్కత్, షమీ
News April 6, 2025
కంచంలో సన్నబియ్యం.. కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా: CM

TG: భద్రాచలం పర్యటనలో భాగంగా సారపాకలో ఓ రేషన్ లబ్ధిదారుడి ఇంట సన్నబియ్యంతో భోజనం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ‘పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం, కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించా’ అంటూ సీఎం రాసుకొచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను జతపరిచారు.
News April 6, 2025
IPL: MI ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్

ముంబై జట్టుకు గుడ్‌న్యూస్. నిన్న జట్టుతో చేరిన స్టార్ పేసర్ బుమ్రా రేపు RCBతో జరిగే MI ప్లేయింగ్ 11కు అందుబాటులో ఉండనున్నారు. నెట్స్‌లో ఈ స్పీడ్ గన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నట్లు హెడ్ కోచ్ జయవర్దనే వెల్లడించారు. రేపు RCBతో జరిగే మ్యాచ్‌కు మ్యాచ్‌లో ఆడే వీలుందని ఆయన చెప్పారు. కాగా తొలుత రేపు జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండరనే ప్రచారం జరిగింది.