News July 6, 2024
అనంత్ అంబానీ పెళ్లి.. ట్రాఫిక్ ఆంక్షలపై నెటిజన్ల ఫైర్

ఈనెల 12న ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి జరగనుంది. దీంతో ‘పబ్లిక్ ఈవెంట్’ సందర్భంగా వేదిక పరిసరాల్లో 12-15 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ముంబై పోలీసులు సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదెలా పబ్లిక్ ఈవెంట్ అవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. పెళ్లి అంబానీ కుటుంబ ప్రైవేట్ కార్యక్రమమని, అందుకు తాము ఇబ్బందులు పడాలా? అని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News March 4, 2026
బస్సుల్లో తగ్గిన పురుష ప్రయాణికుల సంఖ్య

AP: ‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. FEBలో నిత్యం 26 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు RTC తెలిపింది. దీంతో ఆక్యుపెన్సీ 92% దాటింది. అదే సమయంలో పురుషులు బస్సుల్లో ట్రావెల్ చేయడానికి జంకుతున్నారు. వారి సంఖ్య 37శాతానికి పడిపోయింది. బస్సుల్లో సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాము డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
News March 4, 2026
ఆయిల్ టెన్షన్ అక్కర్లేదు.. 8 వారాల నిల్వలు

ఇరాన్ ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగొచ్చని విశ్లేషణలు వస్తున్నా భారత్‌లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన వద్ద 8వారాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు 40% మాత్రమే కాగా.. ప్రత్యామ్నాయంగా క్రూడాయిల్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అటు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
News March 4, 2026
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. పరీక్ష ప్రైమరీ కీ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 MTS, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు నిర్వహించిన (CBIC & CBN) పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే రూ.50 చెల్లించి, మార్చి 6 వరకు తెలుపవచ్చు. వెబ్‌సైట్: https://ssc.gov.in


