News March 16, 2024

అనంత: ‘ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేయాలి’

image

అనంతపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్ ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పోస్టర్లను, ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News April 5, 2025

‘చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు’

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అనంతపురం డివిజన్‌కు సంబంధించి జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ, డీఎల్సీ/డీఎల్ఎన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ (చుక్కల భూములు) సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతివారం షెడ్యూల్ చేసుకుని జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.

News April 4, 2025

అనంతపురం: పెళ్లై 6 నెలలే.. అంతలోనే మృతి

image

పెళ్లై 6 నెలలు గడవకముందే వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం ఉరవకొండ మండలం రాకెట్ల PABR జలాశయంలో మునిగి కార్తీక్ (25) మృతి చెందాడు. తెలిసిన వారు పిలిస్తే జలాశయం వద్ద వ్యవసాయ మోటర్ దింపడానికి వెళ్ళాడు. జలాశయం లోపలికి వెళ్లిన తరువాత చేపల కోసం వేసిన వల చిక్కుకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 4, 2025

హీటెక్కిన రాప్తాడు రాజకీయం!

image

పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య పొలిటికల్ హీట్ నెలకొంది. కొన్నిరోజులుగా సునీత, తోపుదుర్తి సోదరులు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 8న YS జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తుండగా పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం ఉందంటూ సునీత సంచలన ఆరోపణ చేశారు. వందలాది మందిని చంపించిన నీ భర్త దేవుడా? అంటూ చంద్రశేఖర్ ఇటీవల ప్రశ్నించారు. విమర్శ ప్రతి విమర్శలతో రాప్తాడు రాజకీయం హీటెక్కింది.

error: Content is protected !!