News March 18, 2024
అనంత: కొండ గుట్టలో చిరుత పులి మృతి
శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో సోమవారం ఓ చిరుత పులి మృతిచెందింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులి అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిందా?.. లేదా ఇతర కారణాలతో మృతి చెందిందా? తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Similar News
News October 31, 2024
శ్రీ సత్యసాయి: ‘కేజీబీవీ టీచింగ్ పోస్టుల మెరిట్ లిస్ట్ వచ్చేసింది’
శ్రీ సత్యసాయి జిల్లాలో కేజీబీవీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు మెరిట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు బ్లాక్ స్పాట్లో ఉంచినట్లు డీఈవో కిష్టప్ప తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆధారాలతో అందజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.
News October 31, 2024
సమష్టిగా పనిచేసి నేర నియంత్రణకు అడ్డుకట్ట వేయాలి: ఎస్పీ
సమష్టిగా పనిచేసే నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను విచారించి త్వరగా పూర్తి చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. హత్య, పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులపై ఎస్పీ ఆరా తీశారు.
News October 30, 2024
RESULTS: ఫార్మా డీ ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 2, 3, 4 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R14, R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.