News March 16, 2024

అనంత: ఒకప్పుడు టీచర్.. ఇప్పుడు వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి

image

గుడిబండ మండలం పలారంలో రైతు కుటుంబానికి చెందిన కుటుంబంలో జన్మించిన ఈర లక్కప్ప మడకశిర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమితులయ్యారు. ఆయన 1989-99 వరకు ఓ స్వచ్ఛంద సంస్థలో టీచర్‌గా పనిచేశారు. 2006-2011 వరకు గుడిబండ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. 2015-2019 వరకు వైసీపీ ఎస్సీ సెల్‌ మండల కన్వీనర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 6, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.

News November 5, 2025

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, విస్తరించాలని కలెక్టర్ ఆనంద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ స్థాయి వరకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని అన్నారు.

News November 4, 2025

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

image

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.