News May 21, 2024
ఈనెల 29 నుంచే అనంత్& రాధిక వివాహ వేడుక

బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ల వివాహానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 29 నుంచి జూన్ 1వరకు జరిగే వివాహ వేడుకలో ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్లో మొబైల్ ఫోన్స్ వాడకం నిషేధించినట్లు తెలుస్తోంది. ఇటలీలో వివాహ వేడుక మొదలై స్విట్జర్లాండ్‌లో ముగియనుంది. ప్రీవెడ్డింగ్ వేడుకను రూ.వెయ్యి కోట్లతో అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే.
Similar News
News September 3, 2025
వైసీపీ ఎమ్మెల్యేలకు ఇదే నా విజ్ఞప్తి: స్పీకర్

AP: చంద్రబాబుకు ధైర్యముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్న <<17591420>>సజ్జల<<>> కామెంట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. ‘పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి. సభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి. స్పీకర్‌గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా’ అని ట్వీట్ చేశారు.
News September 3, 2025
APPLY: రూ.1,40,000 జీతంతో 248 పోస్టులు

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) 248 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, JE, సీనియర్ అకౌంటెంట్, సూపర్వైజర్(IT), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులను బట్టి డిగ్రీ/బీ.టెక్/సీఏ చదివి ఉండాలి. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.27,000-రూ.1,40,000 వరకు ఉంటుంది. వచ్చే నెల 1లోగా nhpcindia సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News September 3, 2025
కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్నెస్ టెస్ట్ పూర్తి!

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్నెస్ టెస్ట్ పూర్తయినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. మిగతా ప్లేయర్లందరికీ ఇండియాలోనే టెస్టులు జరగగా, ఆయనకు మాత్రమే విదేశాల్లో నిర్వహించారని పేర్కొన్నాయి. ఇటీవల రోహిత్ శర్మ, గిల్, సిరాజ్, బుమ్రా తదితర ఆటగాళ్లకు బెంగళూరులో ఫిట్నెస్ టెస్టులు <<17575424>>జరిగిన<<>> సంగతి తెలిసిందే. ఈ నెలలో నిర్వహించే సెకండ్ ఫేజ్‌లో మిగతా ప్లేయర్లనూ పరీక్షించనున్నారు.