News July 13, 2024
అనంత్-రాధికా వెడ్డింగ్.. ఫస్ట్ ఫొటో

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ బంధంతో నిన్న ఒక్కటయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి వచ్చింది. వీరి వివాహానికి దేశవిదేశాల నుంచి అతిథులు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు శుభ్ ఆశీర్వాద్, రేపు మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలు జరగనున్నాయి.
Similar News
News January 19, 2026
నేటి ముఖ్యాంశాలు

❆ BRS, KCRను బొంద పెడితేనే NTRకు నివాళి: రేవంత్
❆ ఫిబ్రవరి 15కు ముందే మున్సిపల్ ఎన్నికలు: పొంగులేటి
❆ రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది: హరీశ్‌రావు
❆ వచ్చే ఏడాది జులై 27- ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు
❆ AP: బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN
❆ రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స
❆ న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా
News January 19, 2026
మా ఆట నిరాశపరిచింది: గిల్

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో తాము ఆడిన విధానం నిరాశపరిచిందని భారత కెప్టెన్ గిల్ అన్నారు. ‘మేం కొన్ని విషయాలను సరిచేసుకోవాలి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు మాకు సానుకూల అంశం. 8వ స్థానంలో వచ్చి హర్షిత్‌లా ఆడటం అంత సులభం కాదు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎలాంటి కాంబినేషన్స్ పని చేస్తాయో చూడాలి’ అని <<18892634>>మ్యాచ్ అనంతరం<<>> చెప్పారు.
News January 19, 2026
UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎంత తీసుకోవచ్చంటే?

ఏప్రిల్ నుంచి UPI ద్వారా PF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునేందుకు EPFO ఏర్పాట్లు చేస్తోంది. ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ.25 వేలు వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది. విత్ డ్రాకు అర్హత ఉన్న బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్(25%)ను విడిగా చూపిస్తుందని సమాచారం. దీనిపై EPFO, C-DAC, NPCI మధ్య చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా BHIM యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.


