News April 4, 2024
విజయ్ దేవరకొండ బూతుపై అనసూయ స్పందనిదే..

‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మాట్లాడిన <<12982348>>బూతు<<>> పదంపై విమర్శలు వస్తున్నాయి. ‘ఇష్టం వచ్చినట్లు వాగడం, తర్వాత తెలంగాణ హీరో మీద విషం చిమ్ముతున్నారని PR మాఫియాతో సింపతీ డ్రామాలు చేయడం, ఇందులో అనసూయను లాగడం’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. ‘ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను చాలాసార్లు చెప్పి వదిలేశా. ఈ ట్వీట్‌నూ వారి స్వార్థానికి వాడుకుంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 30, 2026
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో ఈరోజు నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మూడురోజులూ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉ.8-10 మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.
News March 30, 2026
ఐదు గ్యారెంటీలతో అస్సాం బరిలో కాంగ్రెస్

ఐదు గ్యారెంటీల మేనిఫెస్టోతో కాంగ్రెస్ అస్సాం ఎన్నికల బరిలోకి దిగింది. మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు వ్యాపార విస్తరణకు ₹50వేల సాయం చేస్తాయని ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు నెలకు ₹1,250 చొప్పున పెన్షన్లు, 100 రోజుల్లోనే సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో న్యాయం, ₹25లక్షల క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్, 10లక్షల మందికి శాశ్వత భూపట్టాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చింది.
News March 30, 2026
US స్థావరాలపై దాడుల్లో ఇరాన్‌కు రష్యా సహకారం: జెలెన్‌స్కీ

సౌదీ అరేబియాలోని US స్థావరాలపై ఇరాన్ చేపట్టిన దాడి వెనుక రష్యా సహకారం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇరాన్‌కు రష్యా 100% సహకరిస్తోందన్నారు. మార్చి 20, 23, 25 తేదీల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ శాటిలైట్ చిత్రాలను రష్యా క్యాప్చర్ చేసిందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు అలా శాటిలైట్ ఇమేజెస్‌ను రష్యా సాధారణంగా సేకరించదని పేర్కొన్నారు.


