News November 7, 2024
ఇక జర్మనీ ఎకానమీ పనైపోయినట్టే!
జర్మనీ ఎకానమీ పతనం అంచున నిలబడింది. మానుఫ్యాక్చరింగ్ గ్రోత్ నెగటివ్‌లోకి వెళ్లింది. అప్పులు పెరిగాయి. పడిపోయిన GDP పుంజుకొనే అవకాశమే కనిపించడం లేదు. బడ్జెట్ లేనప్పటికీ ఉక్రెయిన్‌కు సాయం చేస్తోంది. తానే ఆంక్షలు పెట్టి రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ను చీప్‌గా కొనలేక ఇబ్బంది పడుతోంది. పెరిగిన పవర్, ఫుడ్ ఛార్జీలు, ద్రవ్యోల్బణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారు.
Similar News
News November 7, 2024
INDvsSA: టీ20 ట్రోఫీ ఇదే
సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా రేపు రాత్రి 8.30గంటలకు మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ ఆవిష్కరించారు. ఇద్దరూ కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ఈ టీ20 సిరీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News November 7, 2024
త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం
AP: దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. త్వరలోనే దేవాలయ ట్రస్టుబోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతామూర్తుల మంత్రోచ్చారణ వినిపించాలని పేర్కొన్నారు.
News November 7, 2024
నేను ఎవ్వరి కాళ్లు పట్టుకోను: పొంగులేటి
TG: తాను ఎవ్వరి కాళ్లు పట్టుకోనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒకే ఒక్కసారి పార్టీ కార్యక్రమంలో పెద్దవాడని భావించి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకని, రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడుతుందని చెప్పారు. మరోవైపు కేటీఆర్ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తానన్నారు.