News April 12, 2025

అండర్సన్‌కు ‘నైట్‌హుడ్’ అవార్డ్

image

లెజెండరీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్‌కు ఇంగ్లండ్ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘నైట్‌హుడ్’ను ప్రకటించింది. ఈ పురస్కార గ్రహీతలను ‘సర్’ అనే బిరుదుతో సత్కరిస్తారు. దీంతో ‘కంగ్రాట్స్ సర్ జిమ్మి అండర్సన్’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. తమ దేశ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను కొనియాడింది. అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచారు.

Similar News

News November 25, 2025

T20 WC: గ్రూపుల వారీగా జట్లు

image

టీ20 ప్రపంచకప్-2026లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, USA ఉన్నాయి. పై 4 గ్రూపుల్లో ఏది టఫ్‌గా ఉందో కామెంట్ చేయండి.
టీమ్ ఇండియా గ్రూప్ మ్యాచుల షెడ్యూల్ ఇలా:
*ఫిబ్రవరి 7న ముంబైలో USAతో, 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్థాన్‌తో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది.

News November 25, 2025

బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు!

image

TG: గతంలో పంచాయతీ ఎన్నికల వెంటనే పరిషత్ ఎన్నికలు (MPTC, ZPTC) జరిగేవి. కానీ, ఈసారి పరిషత్ ఎన్నికలను కొంత ఆలస్యంగా నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడంతో ముందుగా సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశం తేలాక పరిషత్ ఎన్నికలు నిర్వహించనుంది.

News November 25, 2025

12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

image

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.