News November 6, 2024

IPL వేలంలోకి అండర్సన్

image

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ IPL మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 42 ఏళ్ల ఆటగాడు చివరిసారి 2011, 2012లో వేలంలో పాల్గొనగా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆ తర్వాత అండర్సన్ IPL వైపు తొంగిచూడలేదు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత IPLలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.

Similar News

News December 29, 2025

నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు!

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1.30AMకు VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. తెల్లవారుజామున 5.30కు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మందికి దర్శనం కల్పించేలా TTD ఏర్పాట్లు చేసింది.

News December 29, 2025

గర్భిణులు శివలింగాన్ని పూజించవచ్చా?

image

గర్భిణులు శివలింగాన్ని నిరభ్యంతరంగా పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. దీనికి ఎటువంటి నిషేధం లేదంటున్నారు. శివారాధన వల్ల తల్లికి మానసిక ప్రశాంతత, బిడ్డకు రక్షణ లభిస్తాయని సూచిస్తున్నారు. అయితే శరీరాన్ని కష్టపెట్టే కఠిన ఉపవాసాలు, నియమాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎక్కువ సేపు నిలబడకుండా కూర్చుని పూజ చేయాలంటున్నారు. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే చిన్న శివలింగానికి పూజ చేయవచ్చని అంటున్నారు.

News December 29, 2025

‘దశరథ గడ్డి’తో పాడి పశువులు, జీవాలకు కలిగే ఉపయోగాలివే..

image

☛ దశరథ గడ్డిని ఆవులు, గేదెలకు ప్రతిరోజూ 2 కేజీల చొప్పున ఇస్తే పాల దిగుబడి, వెన్నశాతం వృద్ధి చెందుతుంది.
☛ మేకలు, గొర్రెలకు దాణా బదులుగా 50 శాతం ఈ గడ్డిని ఆహారంగా ఇస్తే వాటి పెరుగుదల బాగుంటుంది.
☛ లేయర్ (ఆడ) కోడిపిల్లలకు ఆహారంలో 6 శాతం ఈ గడ్డిని ముక్కలు చేసి వేస్తే గుడ్ల నాణ్యత పెరుగుతుంది.
☛ కుందేళ్లు, పందులకు ఈ గడ్డిని అందిస్తే వాటి పెరుగుదల వేగంగా ఉంటుంది.