News April 8, 2025

భారత జట్టుకు ఎంపికైన ఆంధ్రా అమ్మాయి.. అభినందించిన సీఎం

image

ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఎన్.శ్రీ చరణి భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. SL, SAతో వన్డే ట్రై సిరీస్ ఆడే టీమ్‌లో ఆమె చోటు దక్కించుకున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ చరణి రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారని, ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ X వేదికగా అభినందనలు తెలిపారు. క్రికెట్‌లో ఆమె జర్నీ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Similar News

News April 17, 2025

బయట జ్యూస్ తాగుతున్నారా? ఇది చూడండి

image

TG: హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. అక్కడ తుప్పు పట్టి అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. పండ్లపై ఈగలు, బొద్దింకలు వాలడంతో పాటు ఎక్స్‌పైరీ అయిపోయిన సిరప్స్ వాడటంపై సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను అధికారులు Xలో షేర్ చేశారు. ఇవి చూశాక బయట జ్యూస్ తాగే పరిస్థితి లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 17, 2025

హజ్ యాత్రపై ప్రధానికి.. స్టాలిన్ లేఖ

image

సౌదీ ప్రభుత్వం హజ్ యాత్ర ప్రైవేట్ కోటా తగ్గించిన నేపథ్యంలో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి తమిళనాడు CM స్టాలిన్ లేఖ రాశారు. సౌదీ నిర్ణయంతో వేలమంది ముస్లింలలో యాత్రకు వెళ్తామా.. లేదా .? అనే సందిగ్ధత నెలకొందన్నారు. ఇస్లాంలో ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రకు ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకుంటారని లేఖలో తెలిపారు. సౌదీతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని ప్రధానిని కోరారు.

News April 17, 2025

నష్టాలతో మొదలై.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటి క్రితం 1074 పాయింట్ల లాభంతో 78,126 వద్ద ట్రేడ్ అవుతోంది. Nifty 300 పాయింట్ల లాభంతో 23,737 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతీ ఎయిర్‌టెల్, ఐసీసీఐ బ్యాంక్, గ్రాసిం ఇండస్ట్రీస్, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, L&T, HCL టెక్నాలజీస్ నష్టాల్లో ఉన్నాయి.

error: Content is protected !!