News June 4, 2024

TDP MLAగా గెలిచిన అంగన్‌వాడీ టీచర్

image

AP: అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా నిలిచింది. వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన శిరీష 15 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు. గతంలో అంగన్‌వాడీ టీచర్‌గా ఆమె.. ఇప్పుడు MLAగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.

Similar News

News November 29, 2024

ఆ ప్రచారంలో అల్లు అర్జున్ పాలుపంచుకోవడం సంతోషం: సీఎం రేవంత్

image

డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించే ప్రకటనలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘మన పిల్లల్ని, రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి రక్షించుకునేందుకు ప్రజల్లో అవగాహనకోసం చేపట్టిన ప్రచారంలో అల్లు అర్జున్‌ని చూడటం సంతోషంగా ఉంది. ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’ అని ట్విటర్లో పిలుపునిచ్చారు.

News November 29, 2024

క్రికెటేతర అథ్లెట్లకేదీ గౌరవం.?

image

ఫొటోలోని వ్యక్తి పేరు సర్వాన్ సింగ్. 1954 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చారు. అయినా గుర్తింపు, ఉద్యోగం రాలేదు. బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్‌ రెజిమెంట్‌లో చేరి 1970లో రిటైర్ అయ్యారు. బతుకుతెరువు కోసం గోల్డ్ మెడల్ అమ్మేసి ట్యాక్సీ కొనుక్కున్నారు. పేదరికంలోనే కన్నుమూశారు. నేటికీ క్రికెటేతర అథ్లెట్లలో చాలామందిది ఇలాంటి కథే. ఇతర క్రీడలకూ దేశంలో ప్రాధాన్యం దక్కాలన్నదానిపై మీ అభిప్రాయం?

News November 29, 2024

అందరి సపోర్ట్ భారత్‌కే.. ఒంటరైన పాక్!

image

ICC ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు భారత్‌కే సపోర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు ఒప్పుకోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒంటరైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో భద్రత దృష్ట్యా అక్కడికి వెళ్లేది లేదని భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టోర్నీ పాకిస్థాన్ నుంచి తరలించి వేరే దేశాల్లో నిర్వహించేందుకు ICC కసరత్తు చేస్తోంది.