News September 22, 2024
రేపు అంగప్రదక్షిణం టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లు రేపు విడుదల కానున్నాయి. 2024 డిసెంబర్ టోకెన్లు సెప్టెంబర్ 23న ఉదయం 10గంటలకు అందుబాటులోకి వస్తాయి. టికెట్ల కోసం ttdevasthanams.ap.gov.inలో చూడవచ్చు.
Similar News
News December 31, 2025
త్వరలో 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: DGP

TG: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 14వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నిన్న ప్రెస్ మీట్లో ప్రకటించారు. ప్రభుత్వానికి ఖాళీల ప్రతిపాదనలు పంపామని, త్వరలో అనుమతి రానుందని చెప్పారు. కాగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 3 సార్లు (2016, 2018, 2022) మాత్రమే నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోంది.
News December 31, 2025
సకల దోష నిర్మూలన కోసం ‘నిమ్మకాయ దీపం’

శని, కుజ, కాలసర్ప దోషాలతో వివాహ, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి నిమ్మకాయ దీపం అత్యుత్తమ పరిహారం అని పండితులు సూచిస్తున్నారు. గ్రామ దేవతల ఆలయాల్లో రాహుకాలంలో మహిళలు ఈ దీపాలు వెలిగిస్తే ప్రతికూల శక్తులన్నీ తొలగి శుభం కలుగుతుందని చెబుతున్నారు. కుటుంబంలో శాంతి, అష్టైశ్వర్యాల కోసం కూడా ఈ దీపం వెలిగిస్తారు. నిమ్మకాయ దీపం ఎలా వెలిగించాలి, ఇతర నియమాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 31, 2025
ఒనగడోరి కోడి, కిలో రూ.2 లక్షలు.. ఎందుకంటే?

జపాన్‌కు చెందిన అరుదైన, అత్యంత ఖరీదైన కోడి ‘ఒనగడోరి’. ఈ కోళ్లలో మగ కోడి సుమారు 1.8 కిలోలు, ఆడ కోడి 1.35 కిలోల బరువు పెరుగుతాయి. ఒనగడోరి జాతి మగ కోడికి సుమారు 12 అడుగుల వరకు పొడవు ఉండే తోక ఉండి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ కోళ్లను జపాన్ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా, వీనిని పెంచడం, తినడం అదృష్టానికి, శుభానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఈ కోళ్ల ధర స్థానికంగా కిలో రూ.2 లక్షల వరకు ఉంటుంది.


