News October 11, 2024

జగన్‌పై కోపం లడ్డూపై చూపించారు: నారాయణ

image

AP: జగన్‌పై ఉన్న కోపాన్ని కూటమి సర్కార్ తిరుమల లడ్డూపై చూపించిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఈ అంశం RSSకు రాజకీయంగా ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వం మద్యంలో హోల్‌సేల్‌గా దోచుకుందని మండిపడ్డారు. ఇప్పుడు TDP, YCP సిండికేట్‌గా మారి అరాచకం చేయబోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు.

Similar News

News October 20, 2025

తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదు..

image

చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే దీని వెనక మరోకోణం కూడా ఉంది. వరాహస్వామి అంశతో భూదేవి నరకుడికి జన్మనిస్తుంది. నరకుడు బాణాసురిడి స్నేహంతో రాక్షస లక్షణాలను పొంది ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించిన భూదేవి విల్లంబులు చేతబట్టి నరకాసురుడిని వధిస్తుంది. తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదని పురాణాలు చెబుతున్నాయి.

News October 20, 2025

సౌతాఫ్రికాతో టెస్టు.. రూ.60కే టికెట్

image

క్రికెట్ అంటే భారత్‌లో ఓ ఎమోషన్. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. T20ల ప్రభావమో, ఏమో టెస్టులకు ఆదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌కు ప్రేక్షకుల స్పందన చూస్తే అదే అనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కోల్‌కతా వేదికగా (Nov 14-18) సౌతాఫ్రికాతో భారత్ తలపడే తొలి టెస్టుకు టికెట్ ప్రారంభ ధర రోజుకు రూ.60గా నిర్ణయించారు. ఇవాళ మ.12 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.

News October 20, 2025

వీరికి వారం ముందు నుంచే ‘దీపావళి’

image

మనం దీపావళి ఏ రోజైతే ఆరోజే వేడుకలు చేసుకుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్​లోని సెమ్రా గ్రామంలో దీపావళి వేడుకలు వారం ముందు నుంచే మొదలవుతాయి. ఈ ఆచారం వెనుక ఓ కారణం ఉంది. పూర్వం సింహం దాడిలో మరణించిన సర్దార్ దేవ్, గ్రామ పూజారి కలలోకి వచ్చి దీపావళి పండుగను ముందే జరపాలని చెప్పాడట. అలా చేయకపోతే దురదృష్టం కలుగుతుందని హెచ్చరించాడట. అప్పటి నుంచి అక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఊర్లో OCT 20నే దీపావళి మొదలైంది.