News March 20, 2024

లెక్కలు సెటిల్ చేస్తున్న అనిల్ అంబానీ!

image

గతంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ఏడాది వ్యవధిలో రిలయన్స్ పవర్ షేర్లు 120% పెరగడం ఆయనకు కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఐసీఐసీఐ, యాక్సిస్, DBS బ్యాంకులకు ఆయన చెల్లించాల్సిన బాకీలు సెటిల్ చేసేశారట. ఇప్పుడు జేసీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి కట్టాల్సిన రూ.2100 కోట్ల రుణాన్ని కూడా తీర్చేందుకు సిద్ధమయ్యారట.

Similar News

News January 6, 2025

చైనా వైరస్ ఎఫెక్ట్.. కర్ణాటక ప్రభుత్వం కీలక సూచన

image

కర్ణాటకలో ఇవాళ రెండు hMPV వైరస్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని సూచించింది. మరోవైపు దేశంలో కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.

News January 6, 2025

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‌’కు మరో షాక్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్‌’కు తమిళనాడు‌లో మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు నిర్వహించదలచిన ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో <<15078900>>సినిమా రిలీజ్‌<<>> కూడా చేయొద్దని లైకా ప్రొడక్షన్స్ సూచించినట్లు తెలిపాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘ఇండియన్-2’ ఫ్లాప్ కావడంతో ఈ మూవీపైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు.

News January 6, 2025

BREAKING: దేశంలో 4కి చేరిన HMPV కేసులు

image

దేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. కోల్‌కతాలో 5 నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇవాళ ఒక్క రోజే 4 నాలుగు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే.