News September 5, 2025

అనిల్ అంబానీ రుణ ఖాతాలు మోసపూరితం: బ్యాంక్ ఆఫ్ బరోడా

image

రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ రుణఖాతాలు మోసపూరితమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించినట్టు Stock Exchangesకు ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే BOB ఆరోపణలను ఖండిస్తున్నట్టు అనిల్ అధికార ప్రతినిధి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయన న్యాయ సలహాలు తీసుకుంటారని వెల్లడించారు.

Similar News

News September 7, 2025

సీఎం కలల ప్రాజెక్టు గురించి తెలుసా?

image

TG: సీఎం రేవంత్ కలల ప్రాజెక్టుగా ఉన్న <<17640080>>మూసీ<<>> పునరుజ్జీవన పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే CM ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యయనానికి రేవంత్ బృందం UK, దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ADB ₹4,100 కోట్ల రుణాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలకు సంబంధించి మూడు DPRలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి.

News September 7, 2025

దేశ ప్రయోజనాల కోసం ఓటేయండి: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

image

ఎంపీలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికను కేవలం ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికగా చూడొద్దని కోరారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాశారు. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం ఓటేయాలని కోరారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

News September 7, 2025

చదువుకు పర్యాయపదం చంద్రబాబు: టీడీపీ

image

AP: మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు TDP దీటుగా బదులిచ్చింది. ‘30 ఇంజినీరింగ్ కాలేజీలు లేనిచోట 300కు పైగా నెలకొల్పింది చంద్రబాబు. DSCలతో 2 లక్షల మంది టీచర్లను నియమించారు. ISB, IIIT, NAC, NALSAR, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తీసుకొచ్చారు. జగన్ తెచ్చింది 950 సీట్లే. చదువుకు CBN పర్యాయపదం’ అని Xలో పేర్కొంది.