News March 26, 2025
చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు. ఉగాదికి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.
Similar News
News March 29, 2025
కన్నప్ప విడుదల వాయిదా: మంచు విష్ణు

కన్నప్ప సినిమా విడుదల ఆలస్యం అవుతుందని నటుడు, నిర్మాత మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. అందుకే విడుదల తేదీ ఆలస్యం కానుంది. దీనికి మేం చింతిస్తున్నాం. మీ ఓపికకు, మద్దతుకు ధన్యవాదాలు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
News March 29, 2025
తమన్నాతో బ్రేకప్ వార్తలు.. విజయ్ వర్మ కామెంట్స్ వైరల్

నటి తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని కొన్ని రోజలుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో రిలేషన్షిప్ను ఓ ఐస్క్రీమ్లా ఆద్యంతం ఆస్వాదించాలని, అలా చేస్తే సంతోషంగా ఉండగలమని విజయ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. సంతోషం, బాధ, కోపం లాంటి ప్రతి అంశాన్ని స్వీకరించి ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు, ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలెడతామో అప్పుడే అసలు సమస్యలొస్తాయని తమన్నా ఇటీవల వ్యాఖ్యానించారు.
News March 29, 2025
మయన్మార్లో మరోసారి భూకంపం

మయన్మార్లో మళ్లీ భూకంపం వచ్చింది. ఆ దేశ రాజధాని నేపిడా సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తెలిపాయి. 24గంటల వ్యవధిలో 15సార్లు ఆ దేశంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. నిన్న 7.7 తీవ్రతతో మయన్మార్, థాయ్లాండ్లో సంభవించిన భారీ భూకంపానికి 1000 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.