News March 17, 2025
మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ

మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్‌తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. సినిమా కథలకు వైజాగ్‌ను తాను సెంటిమెంట్‌గా భావిస్తానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News March 17, 2025
సిల్లీ ఆస్కార్లను వాళ్ల దగ్గరే ఉంచుకోమనండి: కంగన

కంగన ఇందిరాగాంధీ పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’కి OTTలో మంచి ఆదరణ వస్తోంది. దీంతో ఆ సినిమాను ఆస్కార్లకు పంపించాలని, కచ్చితంగా అవార్డులు గెలుచుకుంటుందని ఓ అభిమాని ట్వీట్ చేయగా కంగన స్పందించారు. ‘తన అసలు ముఖాన్ని చూపించినా, ఇతరులపై చేసే అణచివేతను గుర్తుచేసినా అమెరికా తట్టుకోలేదు. సిల్లీ ఆస్కార్లను వారి దగ్గరే ఉంచుకోమనండి. మనకు మన జాతీయ పురస్కారాలున్నాయి’ అని స్పష్టం చేశారు.
News March 17, 2025
గ్రామ, వార్డు వాలంటీర్లపై కీలక ప్రకటన

AP: గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పని చేయట్లేదని స్పష్టం చేశారు. వారిని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపునకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ చేసేవాళ్లమని వివరించారు.
News March 17, 2025
పోలవరం ఎత్తును తగ్గించింది జగనే: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇందులో కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించిందన్నారు. తొలి దశ R&Rను 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ఎత్తును జగన్ హయాంలోనే రెండుగా విభజించారని, 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది ఆయనేనని విమర్శించారు. పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించారో జగన్‌నే అడగాలన్నారు.