News September 20, 2024

జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.

Similar News

News January 22, 2026

ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ అమ్మొద్దని వార్నింగ్

image

TG: మెడికల్ షాపుల ఓనర్లకు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ విక్రయించవద్దని ఆదేశించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా అలాంటి 190 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడితే ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ బారినపడతారని, ఇది ప్రాణాంతకం అని తెలిపింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది.

News January 22, 2026

వైద్య రంగంలో సరికొత్త విప్లవం..!

image

ఐఐటీ బాంబే & IIT మండి శాస్త్రవేత్తలు చిన్న రోబోల సహాయంతో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నీటిలోకి వెళ్లి, ఒకేసారి దిశ మార్చుకుంటూ ఎలా ఈదుతాయో ఈ రోబోల ద్వారా విజయవంతంగా గుర్తించారు. జీవుల ప్రాథమిక కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నానో రోబోలు మానవ రక్తనాళాల్లోకి వెళ్లి వ్యాధి ఉన్న చోటే మందులు అందించేలా ప్రయోగాలు చేయనున్నారు.

News January 22, 2026

IITల్లో ఆగని ఆత్మహత్యలు.. మానసిక సమస్యలే కారణమా!

image

దేశవ్యాప్తంగా ఉన్న IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. IIT కాన్పూర్‌లో మంగళవారం మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల, భాషా వివక్ష, ఒంటరితనం, పోటీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో సూసైడ్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ, కారణాలను తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది.