News April 25, 2024
‘NBK 109’ సెట్స్‌లో అడుగు పెట్టిన ‘యానిమల్’ విలన్

నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లోకి యానిమల్ విలన్ బాబీ డియోల్ అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Similar News
News January 6, 2026
విద్యుత్ సరఫరా నెట్వర్క్ పనులకు REC నిధులు

TG: విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి REC (Rural Electrification Corporation Limited) ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. తొలుత HYDలో భూగర్భ కేబుల్ నెట్వర్క్ అభివృద్ధికి ₹4000 కోట్లు ఇవ్వనుంది. DPR ఖరారు కావడంతో ఈ పనులకు టెండర్లను ఆహ్వానించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా ఇతర ప్రాంతాల్లోనూ REC నిధులతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపడతామని అధికారులు తెలిపారు.
News January 6, 2026
వారే నిజమైన హీరోయిన్.. అనసూయ ఆసక్తికర పోస్ట్

నిన్న హీరోయిన్ <<18770152>>రాశీకి<<>> క్షమాపణలు చెప్పిన నటి అనసూయ మరోసారి ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘హీరోయిన్ తెరపై కాదు. సత్యం మాట్లాడే ధైర్యం. సొంత దారిలో నడిచే శక్తి. సరైనదానికి నిలబడే గుండె. అదే నిజమైన హీరోయిన్. మిగతావాళ్లు కేవలం నటులే’ అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అని మరో చర్చ మొదలైంది. గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 6, 2026
BREAKING: విజయ్‌కు సీబీఐ నోటీసులు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.


