News June 16, 2024
ఎన్టీఆర్ మూవీలో ‘యానిమల్’ విలన్?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని శక్తిమంతమైన విలన్ పాత్ర కోసం ఆయనను ప్రశాంత్ నీల్ కలిసినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం NTR దేవర, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ పార్ట్-2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇవి పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.
Similar News
News November 12, 2025
దేహమే శివాలయం అని చెప్పే శ్లోకం

‘దేహం దేవాలయం ప్రోక్తం జీవో దేవ ‘స్సనాతన:’’
ఈ శ్లోకం ప్రకారం.. మన శరీరమే ఒక దేవాలయం. ఈ ఆలయంలో నివసించే ప్రాణం సాక్షాత్తూ పరమశివుడే! మన జీవం, పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం అంతా ఈశ్వరుడే. ఇదే శివతత్వం ముఖ్య సారాంశం. నిజమైన యోగి సాధన ద్వారా ఈ శరీర రహస్యాన్ని అర్థం చేసుకుంటాడు. పంచభూతాలకు అతీతంగా ఉండే పరమ సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ జీవుడు శివయోగిగా మారి, శివుడితో ఏకమవుతాడు. <<-se>>#SIVA<<>>
News November 12, 2025
ఆయిల్‌పామ్.. మొక్కలను ఎంపికలో జాగ్రత్తలు

ఆయిల్‌పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News November 12, 2025
MIDHANIలో 210 పోస్టులు

మిశ్రమ ధాతు నిగమ్(<


