News October 4, 2024

జంతువులకూ ఓ రోజు ఉంది!

image

ప్రకృతి జీవావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి పర్యావరణ వ్యవస్థలోని అన్ని జాతులు సహజీవనం చేస్తాయి. జంతు హక్కులు, సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జంతు సంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం దీని ఉద్దేశం. 1925, మార్చి 24న జర్మనీలోని బెర్లిన్‌లో తొలిసారి జంతువుల దినోత్సవాన్ని నిర్వహించారు.

Similar News

News October 8, 2024

అక్టోబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: నటుడు మందాడ ప్రభాకర్ రెడ్డి జననం
1963: తెలుగు సినిమా నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు మరణం
1970: దక్షిణాది నటి అర్చన జననం
1970: సినీ నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు మరణం
1977: నటి మంచులక్ష్మి జననం
1981: దర్శకుడు దాసరి మారుతి జననం
* భారతీయ వైమానిక దళ దినోత్సవం

News October 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 8, 2024

ఫలవంతంగా ప్రధాని మోదీతో చర్చలు: CBN

image

ప్రధాని మోదీతో ఢిల్లీలో చర్చలు ఫలవంతంగా సాగినట్లు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యయ అంచనాలకు క్యాబినెట్ ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి మోదీ మద్దతు అభినందనీయమని కొనియాడారు. మరోవైపు డిసెంబర్‌లో విశాఖలో కొత్త రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసే అవకాశముందన్నారు. ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు.