News June 2, 2024

చిన్న ఘటనపై రాద్ధాంతం చేశారు: అంజలి

image

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ తనను తోసేసిన ఘటనపై హీరోయిన్ అంజలి మరోసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు మాత్రమే తెలుసు. కొద్దిగా జరగాలంటూ బాలయ్య నెట్టారు. నేను వెంటనే నవ్వేశా. చాలా చిన్న సంఘటనపై సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేశారు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణకు, తనకు పరస్పర గౌరవం ఉందని ఇటీవల <<13346819>>ట్వీట్<<>> చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 11, 2026

మా ‘స్వీటెస్ట్’ ఆయిల్ కొనేందుకు పోటెత్తుతున్నారు: ట్రంప్

image

అమెరికన్ క్రూడ్ ఆయిల్ కొనేందుకు భారీ ట్యాంకర్లు తరలివస్తున్నాయని ట్రంప్ అన్నారు. వీటికి ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సౌదీ, రష్యాల కంటే తమ వద్ద ఎక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. US క్రూడ్‌ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదన్న ట్రంప్.. ఇది స్వీటెస్ట్‌ ఆయిల్ అని పేర్కొన్నారు. హార్ముజ్ రీఓపెనింగ్‌పై పాక్‌లో ఇరాన్-US మధ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ ఈ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

News April 11, 2026

మృతుడి ‘ఆధార్’ను డీయాక్టివేట్ ఎలా చేయాలి?

image

ఎవరైనా చనిపోయాక వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ముఖ్యం. లేదంటే ఆ నంబర్ ఆధారంగా దుండగులు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
✒ https://myaadhaar.uidai.gov.in/లోకి వెళ్లి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్‌తో లాగిన్ అవ్వాలి.
✒ ‘రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్’ ఆప్షన్‌ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి.
✒ డెత్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
#ShareIt

News April 11, 2026

‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. ఇంకా దొరకని హీరోయిన్?

image

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ వారంలో చిత్రీకరించాల్సిన స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ వేట ఇంకా కొలిక్కి రాలేదట. ఇప్పటికే మానస వారణాసి వంటి భామల పేర్లు పరిశీలించినా పాట స్థాయికి తగ్గ వారి కోసం మూవీ యూనిట్ అన్వేషిస్తోందని సమాచారం. హీరోయిన్ ఖరారు కాకపోవడంతో షెడ్యూల్‌లో జాప్యం జరుగుతోంది. ఇది మూవీ రిలీజ్‌పై ప్రభావం చూపుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.