News November 1, 2025
ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను వినియోగించాలి: JC

అన్నమయ్య జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను అధికారులందరూ వినియోగించాలని JC ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తదితర శాఖల జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా సుపరిపాలనపై రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌పై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.
Similar News
News November 2, 2025
నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(ఫొటోలో) జననం
✒ 1995: హీరోయిన్ నివేదా థామస్ జననం
✒ 2000: ISSలో ఆస్ట్రోనాట్స్ నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం
News November 2, 2025
రామప్ప ట్రస్ట్ బోర్డు నియామకం కోసం ఎదురుచూపు?

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ గత నెలలో దరఖాస్తులను స్వీకరించింది. అక్టోబర్ చివరి వారంలో బోర్డు నియామకం ఉంటుందని భావించినప్పటికీ ఆ దిశగా ఏర్పాట్లు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా నామినేట్ పదవుల పంపిణీ జరుగుతుండటంతో నవంబర్ నెలలో ట్రస్ట్ బోర్డు నియామకం జరుగుతుందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ నెలలోనైనా ఏర్పాటయ్యేనా? చూడాలి.
News November 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


