News September 17, 2024

రేపు పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభం: టీడీపీ

image

AP: YCP అధినేత జగన్ MLAగా ఉన్న పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు TDP వెల్లడించింది. ‘రేపు పులివెందుల గాంధీ సర్కిల్, 4రోడ్ల కూడలి వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉంది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై తన ద్వేష బుద్ధి చూపిస్తున్న పులివెందుల MLA కూడా రావచ్చు. ప్రజలు కడుపునిండా అన్నం తినటం రెండు కళ్లతో చూడలేనని అనుకుంటే, బెంగళూరు ప్యాలెస్‌లోనే ఉండిపోవచ్చు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News November 23, 2025

11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

image

AP: 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు కళ్యాణం శివశ్రీనివాసరావు, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్‌కు సత్యనారాయణ రాజు, ఉర్దూ అకాడమీకి మౌలానా షిబిలీ, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్‌కు విక్రమ్, ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్‌కు రామ్‌ప్రసాద్, స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీకి ముక్తియార్‌ను నియమించింది.

News November 23, 2025

DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

image

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్‌లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.

News November 22, 2025

టెర్రర్ మాడ్యూల్.. మరో కీలక నిందితుడి అరెస్ట్

image

ఢిల్లీ పేలుడు-టెర్రర్ మాడ్యూల్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పుల్వామాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తుఫైల్ అహ్మద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు డా.ముజఫర్ ఆగస్టులోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు అఫ్గాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన డాక్టర్లకు, జైషే మహ్మద్ హ్యాండర్లకు అతడే మధ్యవర్తిత్వం వహించినట్లు భావిస్తున్నారు.