News June 23, 2024

HYDలో వచ్చే నెలలో అన్న క్యాంటీన్ ప్రారంభం

image

ఏపీ సీఎం చంద్రబాబు మానసపుత్రిక అన్న క్యాంటీన్‌ను హైదరాబాద్‌లో CBN ఫోరం వ్యవస్థాపకులు అందుబాటులోకి తీసుకురానున్నారు. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జులై మొదటి వారంలో ఇక్కడ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఫోరం ద్వారా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News January 6, 2026

ట్యూటర్ నుంచి వ్యాపారం వైపు అడుగులు

image

సుజాతా అగర్వాల్ హోమ్ సైన్స్‌లో పీజీ చేశారు. పెళ్లి తర్వాత గార్డెనింగ్‌పై మక్కువతో తొలుత ఇంటి దగ్గరే పూల మొక్కలు పెంచుతూ పిల్లలకు ట్యూషన్ చేప్పేవారు. కరోనాలో ఇంటికే పరిమితం కావడంతో ఇంటర్‌నెట్‌లో హైడ్రోపోనిక్స్(మట్టి లేకుండా కేవలం నీటితోనే పంటలు పండించడం) వ్యవసాయ పద్ధతి గురించి తెలుసుకొని, అధ్యయనం చేసి కూరగాయలు పండించాలనుకున్నారు. దానికి అవసరమైన కిట్ కొని దాన్ని ఇంట్లోనే ఒక గదిలో ఏర్పాటు చేశారు.

News January 6, 2026

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.600 పెరిగి రూ.1,38,820కు చేరింది. రెండ్రోజుల్లోనే రూ.3వేలు పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.550 ఎగబాకి రూ.1,27,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.6,000 పెరిగి రూ.2,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 6, 2026

మేడారం జాతర: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

image

TG: మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ ఆఫీసర్లను సెక్టోరల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా ఈ నెల 24న ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్ చేసి, ఫిబ్రవరి 2 వరకు విధుల్లో ఉండాలి.