News June 12, 2024
పవన్‌ను క్లిక్‌మనిపించిన అన్నా లెజినోవా
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మధుర క్షణాలను ఆయన భార్య అన్నా లెజినోవా తన సెల్ఫోన్లో బంధించారు. ఆమె ఓ వైపు ఫొటోలు తీస్తూనే.. మరోవైపు తన భర్త గెలుపును ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Similar News
News December 23, 2024
కళకళలాడిన STOCK MARKETS
వరుస నష్టాలకు తెరపడింది. స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 78,540 (+498), నిఫ్టీ 23,753 (+165) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 270 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు పుంజుకోవడం, హెవీవెయిట్స్‌లో పొజిషన్లే ఇందుకు కారణం. నిఫ్టీ ADV/DEC రేషియో 32:18గా ఉంది. JSWSTEEL, ITC, HINDALCO, TRENT, HDFC BANK టాప్ గెయినర్స్.
News December 23, 2024
బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్వాగతించిన ఫిల్మ్ ఎగ్జిబిటర్లు
TG: బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే, సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు.
News December 23, 2024
మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
TG: మోహన్‌బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు మోహన్‌బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.